: సోనియాగాంధీ ఉత్తరాఖండ్ టూర్


కేంద్రంలో అధికారం నుంచి దిగిపోయాక కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ పూర్తి విశ్రాంతి తీసుకుంటున్నారు. తాజాగా ఆమె ఉత్తరాఖండ్ వ్యక్తిగత పర్యటనకు వెళ్లారు. ఈ మేరకు అక్కడి బగేశ్వర్ జిల్లా కౌసనిలో ఒకటిన్నర కిలోమీటరు దూరం కాలినడకన వెళ్లి శతాబ్ద కాలం నాటి రుద్రధరి అనే ఓ శివాలయాన్ని దర్శించుకున్నారు. అనంతరం అక్కడి స్థానికులు, పలువురితో సోనియా కాసేపు ముచ్చటించారు. నాలుగు రోజుల కిందట తన కుటుంబ మిత్రుడి ఇంట్లో బస చేశారు. అప్పుడు కూడా అక్కడి వారితో ముచ్చటించి, వారి సమస్యలు కూడా తెలుసుకున్నారు. అనంతరం వారితో సరదాగా ఫోటోలకు ఫోజులు కూడా ఇచ్చారు. తరచూ వేసవి సమయంలో ఈ ప్రాంతంలోనే సోనియా వ్యక్తిగతంగా పర్యటిస్తుంటారు.

  • Loading...

More Telugu News