: కేసీఆర్ తదుపరి టార్గెట్ లగడపాటేనా?


హైదరాబాదులోని అక్రమ నిర్మాణాల కూల్చివేతపై దృష్టి పెట్టిన కేసీఆర్ సర్కార్... ఇప్పుడు మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ కు చెందిన మణికొండలోని ల్యాంకో హిల్స్ పై ఫోకస్ చేసినట్టు కనిపిస్తోంది. ల్యాంకో హిల్స్ కు సంబంధించిన సమగ్ర వివరాలను అందజేయాలని రెవెన్యూ అధికారులను టి.ప్రభుత్వం ఆదేశించింది. దీంతో, నిన్న రాజేంద్రనగర్ మండల డిప్యూటీ కలెక్టర్ కె.చంద్రశేఖర్, రెవెన్యూ ఇన్స్ పెక్టర్, వీఆర్వోలు ల్యాంకో హిల్స్ ను సందర్శించారు.

రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ భూములను ఏపీఐఐసీ వేలంపాటలో ల్యాంకో సంస్థ కొనుగోలు చేసింది. అయితే, ఈ భూములు వక్ఫ్ కు చెందినవని అప్పట్లోనే వివాదం తలెత్తింది. దీనిపై కొంత మంది కోర్టుకు కూడా వెళ్లారు. అయితే తుది తీర్పు వెలువడాల్సి ఉంది. గతంలో కేసీఆర్ కు, లగడపాటికి రాజకీయపరంగా వైరం ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఇప్పటికే గురుకుల్ భూములపై ఉక్కుపాదం మోపిన కేసీఆర్ సర్కార్... రానున్న రోజుల్లో ల్యాంకో హిల్స్ ను టార్గెట్ చేస్తుందనే వదంతులు వినిపిస్తున్నాయి.

  • Loading...

More Telugu News