: సోనియా, రాహుల్ లపై కేసు రాజకీయ దురుద్దేశమే: కాంగ్రెస్
నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలకు ఢిల్లీలోని మెట్రోపాలిటన్ కోర్టు సమన్లు జారీ చేయడాన్ని కాంగ్రెస్ ఖండించింది. వారిద్దరిపై కేసు రాజకీయ దురుద్దేశమేనని పార్టీ ఆరోపిస్తోంది. ఈ మేరకు పార్టీ అధికార ప్రతినిధి అభిషేక్ మను సింఘ్వీ ఢిల్లీలో మాట్లాడుతూ, బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి చేసిన ఆరోపణలకు పార్టీ తీవ్రంగా స్పందిస్తుందన్నారు. అధికారంలో ఉన్న బీజేపీ చేసేటువంటి ప్రతీకార పనులను కాంగ్రెస్ సహించదని మరో అధికార ప్రతినిధి రణదీప్ సూరెజ్ వాలా మండిపడ్డారు. అయితే, ఇంతవరకు తమకెటువంటి సమన్లు అందలేదని చెప్పారు. ఒకవేళ అందితే చట్టపరమైన సలహాల మేరకు కాంగ్రెస్, పార్టీ నేతలు తగిన చర్యలు తీసుకుంటారని పేర్కొన్నారు.