: దర్శకుడు కె.విశ్వనాథ్ కు అత్యున్నత గౌరవం
తెలుగు చిత్రరంగానికి గుర్తుంచుకోదగ్గ చక్కటి చిత్రాలను అందించిన ప్రముఖ దర్శకుడు కె.విశ్వనాథ్ కు అత్యున్నత గౌరవం దక్కింది. భారతీయ సినిమా వందేళ్ల పండుగ సందర్భంగా 'లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్' ప్రత్యేక సంచికను విడుదల చేసింది. ఇందులో విశ్వనాథ్ పేరును కూడా చేర్చింది. భారతీయ చలన చిత్ర సీమలో అత్యుత్తమ ఫలితాలు సాధించిన 20 మంది సినీరంగ ప్రముఖుల గురించి 'పీపుల్ ఆఫ్ ద ఇయర్' అనే విభాగంలో వివరించారు. వారిలో తెలుగు దర్శకుడు విశ్వనాథ్ ఒకరు కావడం విశేషం. ఆయనతో పాటు కమల్ హాసన్, నసీరుద్దీన్ షా, షబానా అజ్మీ, ప్రభుదేవా, ఎ.శ్రీకర్ ప్రసాద్, సంతోష్ శివన్ కాజల్, టబు తదితరులు ఉన్నారు.