: స్డేడియంలో కూడా అడుగుపెట్టకూడదు: 'కొరుకుడు' ఫార్వర్డ్ స్వారెజ్ కు ఫిఫా షాక్
ఇటలీతో మ్యాచ్ లో ప్రత్యర్థి డిఫెండర్ ను కొరికిన ఉరుగ్వే స్టార్ ఫార్వర్డ్ లూయిస్ స్వారెజ్ పై ఫిఫా కొరడా ఝుళిపించింది. అతనిపై తొమ్మిది మ్యాచ్ ల నిషేధం విధించింది. అంతేగాకుండా, వరల్డ్ కప్ సందర్భంగా కనీసం స్టేడియంలో కూడా అడుగుపెట్టరాదని ఆదేశించింది. ఘటనపై విచారణ జరిపిన ఫిఫా క్రమశిక్షణ సంఘం ఈ నిర్ణయం ప్రకటించింది. స్వారెజ్ నాలుగు నెలలపాటు సాకర్ సంబంధ కార్యక్రమాల్లో కూడా పాల్గొనరాదని స్పష్టం చేసింది.
కాగా, ఉరుగ్వే జట్టు నాకౌట్ దశకు చేరుకోవడంలో ఈ కొరుకుడు హీరోదే కీలకపాత్ర. నిషేధం నేపథ్యంలో అతను లేకుండానే మైదానంలో దిగాల్సి రావడం నాకౌట్ రౌండ్ లో ఉరుగ్వే విజయావకాశాలపై తప్పక ప్రభావం చూపనుంది.