: ఢిల్లీ నుంచి హుటాహుటిన బయల్దేరుతున్న చంద్రబాబు
తూర్పుగోదావరి జిల్లాలో సంభవించిన గ్యాస్ పైప్ లైన్ పేలుడు దుర్ఘటన నేపథ్యంలో, ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు హుటాహుటిన ప్రమాద స్థలికి బయల్దేరుతున్నారు. ఆయనతో పాటే ఆర్థిక మంత్రి యనమల కూడా వస్తున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో వీరు రాజమండ్రి చేరుకుని... అక్కడ నుంచి రోడ్డు మార్గంలో ఘటనా స్థలికి చేరుకుంటారు. అనంతరం సహాయక చర్యలను చంద్రబాబు స్వయంగా పర్యవేక్షిస్తారు.