: ప్రమాద ఘటనపై స్పందించిన గెయిల్ చైర్మన్
తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామంలో ఈ తెల్లవారుజామున గెయిల్ సంస్థకు చెందిన గ్యాస్ పైప్ లైన్ పేలి 14 మంది సజీవదహనం అయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై గెయిల్ చైర్మన్ బీసీ త్రిపాఠి స్పందించారు. ఘటనలో 18 అంగుళాల పైప్ లైన్ పేలిందని, ఘటనకు కారణాలు తెలియరాలేదని తెలిపారు. సహాయక చర్యలు చేపట్టామని చెప్పారు.