: పైప్ లైన్ పేలుడుపై సమగ్ర విచారణ జరుపుతాం: హోం మంత్రి


గెయిల్ గ్యాస్ పైప్ లైన్ పేలుడు ఘటనా స్థలికి చేరుకున్న ఏపీ హోం మంత్రి చినరాజప్ప సహాయకచర్యలను పర్యవేక్షించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరుపుతామని తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామంలో ఈ పేలుడు కారణంగా 14 మంది సజీవదహనం అయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై హోం మంత్రి తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News