: బోనాల పండుగ కోసం రూ.25 లక్షలు కేటాయింపు
జంట నగరాల్లో బోనాల పండుగ నిర్వహణ కోసం తెలంగాణ ప్రభుత్వం రూ. 25 లక్షలు కేటాయించింది. ఈ మేరకు సాంస్కృతిక శాఖ రూ.25 లక్షలు ఇవాళ విడుదల చేసింది. ప్రతి సంవత్సరం ఆషాడ మాసంలో లాల్ దర్వాజా మహంకాళీ అమ్మవారికి, సికింద్రాబాదులో ఉజ్జయనీ మహంకాళీ అమ్మవారి ఆలయంలో జాతర ఘనంగా జరుగుతున్న విషయం విదితమే. ఈ సందర్భంగా మహిళలు అమ్మవారిని దర్శించుకుని బోనం సమర్పిస్తారు. గోల్కోండ కోటలో ఉన్న ఆలయంలో కూడా బోనాల పండుగ ఘనంగా జరుగుతుంది.