: తాటకి (సోనియా)ని ఎందుకు జైలుకు పంపించరు: సుబ్రమణ్యస్వామి


తాటకిని తీహార్ జైలుకి ఎందుకు పంపించరు? అంటూ బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి ఓ కోడ్ ఉపయోగించి ట్వీట్ చేశారు. సోనియా గాంధీని తాటకి అంటూ పరోక్షంగా వ్యాఖ్యానించారు. 'ఎలాంటి పదవిలో లేకుండానే నేషనల్ హెరాల్డ్ కేసులో చాలా చేస్తున్నాను. అధికారంలో ఉండి కూడా టీడీకే (తాటకి)ని తీహార్ జైలు ఎందుకు పంపించడం లేద'ని ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు. సోనియా, రాహుల్ కోర్టుకు హాజరైతే బెయిలు కోసం దరఖాస్తు చేసుకోవాలని, వారి పాస్ పోర్టులను కోర్టుకు దాఖలు చేయాల్సి ఉంటుందని ఆయన ట్విట్టర్లో వ్యాఖ్యానించారు.

భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ప్రారంభించిన నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించిన నిధులను గోల్ మాల్ చేశారంటూ సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై సుబ్రమణ్య స్వామి కేసు నమోదు చేసిన సంగతి, ఈ కేసులో ఢిల్లీ కోర్టు వారిద్దరికీ సమాన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News