: 'ఆటా' ఉత్సవాల్లో పాల్గొని... సలహాలు స్వీకరిస్తాం: కేటీఆర్


అమెరికాలో ప్రతి ఏటా జూలై మొదటి వారంలో జరిగే 'ఆటా' ఉత్సవాల్లో పాల్గొని ఐటీ అభివృద్ధికి తెలుగువారి సలహాలు స్వీకరిస్తామని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, రాజధానిలో ఉన్న 150 ఐటీ కంపెనీలతో శుక్రవారం సాయంత్రం సమావేశం అవుతున్నామని అన్నారు. ఈ సమావేశంలో ఐటీ పరిశ్రమ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలను ఆయా కంపెనీల నుంచి స్వీకరిస్తామని కేటీఆర్ తెలిపారు.

ఆటా ఉత్సవాల్లో పాల్గొనేటప్పడు అమెరికాలోని ఐటీ కంపెనీలతో కూడా సమావేశమవుతామని ఆయన చెప్పారు. గ్రామీణ ఉపాధి హామీ పధకం సమర్థవంతంగా ఉపయోగించుకుని గ్రామీణ తెలంగాణను అభివృద్ధి చేస్తామని ఆయన పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News