: 'మహా' ప్రభుత్వ ఉద్యోగాల్లో మరాఠాలకు 16 శాతం రిజర్వేషన్లు


మహారాష్ట్రలో అధికారాన్ని నిలుపుకునేందుకు కాంగ్రెస్-ఎన్సీపీ తంటాలు పడుతున్నాయి. ఈ క్రమంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల్లో, విద్యా సంస్థల్లో మరాఠాలకు 16 శాతం, ముస్లింలకు 5 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు సుముఖత వ్యక్తం చేసింది. ఇప్పటికే లోక్ సభ ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా ఘోర పరాజయాన్ని చవిచూసిన అనుభవం నేపథ్యంలో మరాఠాలను ప్రసన్నం చేసుకునే భాగంలోనే ఈ రిజర్వేషన్లు కల్పించింది. మహారాష్ట్రలో మొత్తం 32 శాతం మంది మరాఠాలు, 10.6 శాతం మంది ముస్లింలు ఉన్నారు. ఇద్దరూ ప్రస్తుత అధికార కూటమికి (కాంగ్రెస్-ఎన్సీపీ) మద్ధతు పలుకుతూ వస్తున్నారు. రిజర్వేషన్ల నిర్ణయం రాజకీయ ప్రేరేపితం కాదని ముఖ్యమంత్రి పృథ్వారాజ్ చవాన్ ఖండించారు.

  • Loading...

More Telugu News