: ఏడేళ్లకే... ఏడు రికార్డులను సొంతం చేసుకున్న హైదరాబాదీ
హైదరాబాదులోని నల్లకుంటకు చెందిన ఏడు సంవత్సరాల బాలుడు ఏడు రికార్డులను సొంతం చేసుకుని అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాడు. నల్లకుంట నివాసులైన శ్రీనివాస్, జయంతిల కుమారుడు ప్రణవ్ చిరుప్రాయంలోనే సంగీతాన్ని నేర్చుకోవడం మొదలుపెట్టాడు. స్కేటింగ్ చేస్తూ కీబోర్డు వాయించడంలో నైపుణ్యం సంపాదించుకున్నాడు. ఇటీవల ప్రపంచ సంగీత దినోత్సవం సందర్భంగా, ఇందిరా పార్కులో ఏక కాలంలో ఏడు రికార్డులు సాధించి అందరితో శభాష్ అనిపించుకున్నాడు. పిట్ట కొంచెం - కూత ఘనం అంటే ఇదేనేమో!