: ఫేస్ బుక్ టైంపాస్ కి కాదు: సల్మాన్ ఖాన్
ఫేస్ బుక్ అనేది టైంపాస్ చేసేందుకు కాదని బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ అన్నారు. అభిమానులకు ఉపాధి కల్పన ధ్యేయంగా వెబ్ సైట్ ప్రారంభించిన సందర్భంగా ఆయన పలు విషయాలపై ట్విట్టర్లో తన అభిప్రాయాలను పంచుకున్నారు. సాంకేతిక పరిజ్ఞానం మేథస్సు పెంపొందించుకునేందుకు ఉపయోగించుకోవాలి కానీ కాలక్షేపానికి కాదని ఆయన సూచించారు. అభిమానులకు ఏం చేయాలా? అని ఆలోచించినప్పుడు... సినిమాల ద్వారా వారిలో స్ఫూర్తిని రగిలించే తాను... భవిష్యత్ పై ఆశలు రేకెత్తిస్తే ఇంకా బావుంటుందనిపించిందని, ఆ విషయం తన మిత్రులకు చెబితే వారు సహకరించారని ఆయన తెలిపారు. యువత ఎవరికి వారే అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ప్రయత్నించాలని సల్లూభాయ్ అన్నారు.