: టీడీపీ రైతులకు రోజుకో సాకు చెబుతోంది: ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు
రైతులకు టీడీపీ రోజుకో సాకు చెబుతోందని వైఎస్సార్సీపీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మండిపడ్డారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, రైతు రుణమాఫీని రిజర్వ్ బ్యాంకు ఆమోదించాలని, కేంద్రం అనుమతినివ్వాలని, ఆధార్ కార్డు ఉండాలని టీడీపీ ప్రభుత్వం వింత వింత షరతులు పెడుతోందని అన్నారు. ఆధార్ తో లింక్ వద్దని గతంలో సుప్రీంకోర్టు చెప్పిందని ఆయన గుర్తు చేశారు. బేషరతుగా వ్యవసాయ రుణాలు మాఫీ చేయాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు.