: పాలెం బస్సు దుర్ఘటనపై న్యాయ విచారణ చేపట్టిన జేసీ
మహబూబ్ నగర్ జిల్లాలోని పాలెం వద్ద గతేడాది జరిగిన వోల్వో బస్సు దుర్ఘటనపై న్యాయవిచారణ చేపట్టారు. గతేడాది అక్టోబరు 30వ తేదీన జరిగిన ఈ ఘోర ప్రమాదంలో 45 మంది సజీవ దహనమైన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబందించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ విచారణ కమిటీ, సీబీసీఐడీ విచారణ చేసిన విషయం విదితమే. తాజాగా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జాయింట్ కలెక్టర్ శర్వణ్ ఘటనాస్థలంలో న్యాయవిచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన ప్రమాదం జరిగినప్పుడు ఉన్న ప్రత్యక్ష సాక్షుల గురించి వివరాలు సేకరించారు. న్యాయ విచారణకు సంబంధించిన పూర్తి నివేదికను జిల్లా కలెక్టర్ గిరిజా శంకర్ కు అందించనున్నట్లు జేసీ చెప్పారు.