: పార్టీ మారిన ఎమ్మెల్సీలపై అనర్హత వేటు వేయండి: గీతారెడ్డి


తెలంగాణ కాంగ్రెస్ నుంచి ఐదుగురు ఎమ్మెల్సీలు నిన్న (బుధవారం) టీఆర్ఎస్ లోకి చేరిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వారిపై అనర్హత వేటు వేయాలని టీ కాంగ్రెస్ నేతలు కోరుతున్నారు. ఈ మేరకు డీకే.అరుణ, గీతారెడ్డి మీడియాతో మాట్లాడుతూ, పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వేటు వేయాలని డిమాండ్ చేశారు. అభధ్రతా భావంతోనే టీఆర్ఎస్ వలసలను ప్రోత్సహిస్తోందని విమర్శించారు. అటు పార్టీ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ, రాజకీయాల్లో మార్పులు, చేర్పులు సహజమన్నారు. ఒకే రోజు మూడు పార్టీలు మారిన వారున్నారని చెప్పుకొచ్చారు. అయితే, రాజకీయ నాయకుల్లో స్థిరత్వం ఉండాలని, ప్రజలు అన్నింటినీ గమనిస్తూ ఉంటారని అన్నారు. పార్టీలు మారితే సదరు పార్టీకి సంఖ్యాబలం పెరుగుతుంది తప్ప ఒరిగేదేమి లేదన్నారు. మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాట్లాడుతూ, పార్టీ ఎమ్మెల్సీలు టీఆర్ఎస్ లో చేరడం బాధాకరమన్నారు.

  • Loading...

More Telugu News