: ఇతర పార్టీల్లో ఉంటే సన్నాసులు, టీఆర్ఎస్ లో ఉంటే సమర్థులా..!: ఎల్.రమణ
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు రెచ్చగొట్టే ప్రకటనలు మానుకోవాలని టీ.టీడీపీ నేత ఎల్.రమణ హితవు పలికారు. నేతలు ఇతర పార్టీల్లో ఉంటే సన్నాసులు, టీఆర్ఎస్ లో ఉంటే సమర్థులన్నట్టు ఆయన వ్యాఖ్యానించడం తగదని రమణ పేర్కొన్నారు. ఉభయరాష్ట్రాల్లో తెలుగు ప్రజలున్నారని, అలాంటప్పుడు సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని సూచించారు. టీ.టీడీపీని ఉద్దేశించి చీము, నెత్తురు ఉందా? అని కేసీఆర్ వ్యాఖ్యానించడాన్ని రమణ తప్పుబట్టారు. అధికారంలో ఉన్నారు కదా అని టీఆర్ఎస్ వారి ఎంగిలి మెతుకులకు ఆశపడబోమని అన్నారు. టీఆర్ఎస్ లో చేరే ప్రసక్తేలేదని స్పష్టం చేశారు.