: తన బంధువు ఇల్లు కూల్చారనే కోపంతోనే... కేసీఆర్ ప్రతీకార చర్యలు: దానం నాగేందర్
రెండు రోజుల పాటు హైదరాబాదులోని అయ్యప్ప సొసైటీలో కొనసాగిన నిర్మాణాల కూల్చివేతపై మాజీ మంత్రి దానం నాగేందర్ మండిపడ్డారు. గతంలో కేసీఆర్ బంధువు ఇల్లు కూల్చివేశారన్న కోపంతోనే కేసీఆర్ ప్రతీకార చర్యలకు దిగారని ఆరోపించారు. ఇది ముమ్మాటికీ ప్రతీకార చర్యే అని చెప్పారు. ప్రజా వ్యతిరేకమైన ఇలాంటి నిర్ణయాలను తీసుకుంటే టి.ప్రభుత్వాన్ని నిలదీస్తామని దానం హెచ్చరించారు. పార్టీకి పూర్వ వైభవం తెచ్చేందుకు ప్రయత్నిస్తామని... గ్రేటర్ ఎన్నికల్లో సత్తా చాటుతామని ధీమా వ్యక్తం చేశారు.