: కోడ్ ఉల్లంఘన కేసులో జగన్ కు తాత్కాలిక ఊరట
ఎన్నికల ప్రచార సమయంలో ఎలక్షన్ కమిషన్ కోడ్ ఉల్లంఘించారంటూ నమోదైన కేసులో వైఎస్సార్సీపీ అధినేత జగన్ కు తాత్కాలిక ఊరట లభించింది. నల్గొండ జిల్లా కోదాడలో దాఖలైన కోడ్ ఉల్లంఘన కేసునుంచి తనకు విముక్తి కలిగించాలని ఆయన హైకోర్టును ఆశ్రయించారు. దీన్ని విచారించిన హైకోర్టు స్టే విధించింది.