: కరీంనగర్-తిరుపతి మధ్య రెండు ప్రత్యేక రైళ్లు
ప్రయాణీకుల రద్దీ దృష్టిలో ఉంచుకొని తిరుపతి-కరీంనగర్ మధ్య రెండు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. పెద్దపల్లి, జమ్మికుంట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, విజయవాడ, శ్రీకాళహస్తి మీదుగా ఈ రైళ్లు నడవనున్నాయి. ఫిబ్రవరి 13వ తేదీ రాత్రి 10:40 గంటలకు తిరుపతి నుంచి కరీంనగర్ కు, ఫిబ్రవరి 14వ తేదీ రాత్రి 7:10 గంటలకు కరీంనగర్ నుంచి తిరుపతికి ఈ ప్రత్యేక రైళ్లు వెళతాయని అధికారులు తెలిపారు.