: ఇకపై ఏపీ నుంచి కూడా క్షిపణి పరీక్షలు
ఇప్పటివరకు క్షిపణి పరీక్షలకు వేదిక అంటే అందరికీ ఒడిశాలోని వీలర్ ఐలాండ్ గుర్తుకువచ్చేది. ఇకపై ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా మిస్సైళ్ళను పరీక్షించేందుకు రంగం సిద్ధమవుతోంది. కృష్ణా జిల్లా నాగాయలంక మండలం గుల్లలమోదలో క్షిపణి ప్రయోగ కేంద్రాన్ని నిర్మించనున్నారు. 381 ఎకరాల్లో నిర్మించ తలపెట్టిన ఈ కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. క్షిపణి తయారీ వ్యవస్థలన్నీ హైదరాబాదులో ఉండడంతో ప్రయోగ కేంద్రం కూడా సమీపంలోనే ఉంటే భద్రత రీత్యా మేలన్న అభిప్రాయంతోనే గుల్లలమోద ప్రాజెక్టు నిర్ణయం తీసుకున్నారు. పైగా ఒడిశాకు రవాణా ఎక్కువ సమయం తీసుకుంటుండడం కూడా ఓ కారణం.