: సోనియా, రాహుల్ కు నేషనల్ హెరాల్డ్ కేసులో సమన్లు


కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలకు ఢిల్లీ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు సమన్లు జారీ చేసింది. వారితో పాటు కాంగ్రెస్ నేతలు శ్యామ్ పిట్రోడా, మోతీలాల్ వోరా, ఆస్కార్ ఫెర్నాండేజ్ లకు కూడా సమన్లు అందాయి. ఆగస్టు 7న కోర్టు ముందు హాజరుకావాలని తెలిపింది. నేషనల్ హెరాల్డ్ న్యూస్ పేపర్ కు అనుబంధంగా ఏర్పడ్డ ఓ సంస్థ ('యంగ్ ఇండియన్') కొనుగోలుకు, పలు నగరాల్లో దాని భవన నిర్మాణాలకు కాంగ్రెస్ కు వచ్చిన నిధులను వినియోగించారంటూ బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి పిటిషన్ దాఖలు చేశారు. అంతేగాక ఆ సంస్థలో వారిద్దరికీ 38 శాతం షేర్లు కూడా ఉన్నాయని ఆయన ఆరోపిస్తున్నారు. కాగా, ఢిల్లీ కోర్టు తీర్పును కాంగ్రెస్ హైకోర్టులో అప్పీలు చేయనుంది.

  • Loading...

More Telugu News