: ప్రత్యర్థి కెప్టెన్ పై ధోనీ సానుభూతి


మహేంద్ర సింగ్ ధోనీ కూల్ గా ఉన్నా కిల్లర్ ఇన్ స్టింక్ట్ మెండుగా ఉన్న వ్యక్తి. అలాంటివాణ్ణి సైతం ఇంగ్లండ్ జట్టు కెప్టెన్ ఆలిస్టర్ కుక్ దయనీయ పరిస్థితి కరిగించివేసింది. ధోనీ మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ప్రస్తుత సమయంలో గడ్డుకాలం ఎదుర్కొంటున్న కుక్ కు అందరూ మద్దతుగా నిలవాలని పేర్కొన్నాడు. ప్రతి క్రికెటర్ కెరీర్ లోనూ ఇలాంటి దశ తప్పదని, ఇలాంటప్పుడే వెన్నుదన్నుగా నిలవాలన్నాడు. ఓ రెండు సెంచరీలు కొడితే అందరి నోళ్ళూ మూతపడతాయని అభిప్రాయపడ్డాడు.

ఇటీవలి కాలంలో వరుస పరాజయాలు కుక్ కెప్టెన్సీ సామర్థ్యంపై సందేహాలు లేవనెత్తాయి. తాజాగా శ్రీలంక చేతిలో తొలిసారిగా సొంతగడ్డపై సిరీస్ కోల్పోవడంతో మాజీలు కుక్ పై వరుసబెట్టి విమర్శనాస్త్రాలు సంధించారు. దీంతో, జట్టు కోచ్ కూడా కుక్ తప్పుకుంటే మంచిదన్న అభిప్రాయాలు వెలిబుచ్చాడు.

  • Loading...

More Telugu News