: ఆలయాలలో ఉగాది పచ్చడి


తెలుగువారి జీవితాలలోకి మరో కొత్త సంవత్సరం ప్రవేశించింది. వసంత రాగాలతో మల్లెపూల పరిమళాలతో, మామిడిపండ్ల రుచులతో, కోయిల గానంతో ఉగాదిని తెలుగువారు వైభవంగా జరుపుకుంటున్నారు.ఉగాది పర్వదినం సందర్భంగా రాష్ట్రంలోని దేవాలయాలు భక్తుల నామస్మరణలతో నిండు ఆధ్యాత్మికతను సంతరించుకున్నాయి. విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేచి ఉన్న దుర్గమ్మ దర్శనం కోసం భక్తులు భారీగా తరలివచ్చారు. ఇక్కడ అమ్మవారికి లక్ష మల్లె పూలతో అర్చన చేశారు.

ఇక నల్లమల పర్వత పంక్తులలో శ్రీశైల క్షేత్రంలో వెలసిన భ్రమరాంభా మల్లికార్జునులను చూసి తరించేందుకు భక్తులు పోటెత్తారు. దర్శనం కోసం 10 గంటల సమయం తీసుకుంటోంది. రాష్ట్రంతోపాటు, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు వచ్చారు. పండుగను పురస్కరించుకుని వృద్ధ మల్లికార్జునుడికి రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చనలు నిర్వహిస్తున్నారు. సాయంత్రం 5 గంటలకు రథోత్సవం నిర్వహించనున్నారు.

మరోవైపు భ్రదాచలం, బాసర, శ్రీకాళహస్తి ఆలయాలలోనూ భక్తుల కోలాహలం కనిపిస్తోంది. తిరుమలలో రద్దీ సాధారణంగా ఉంది. సర్వదర్శనానికి నాలుగు గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడక భక్తులకు 1 గంటలో దర్శనం పూర్తవుతోంది. 8 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.

  • Loading...

More Telugu News