: సింగపూర్ అటార్నీ జనరల్ గా భారత సంతతి జడ్జి


సింగపూర్ అటార్నీ జనరల్ గా భారత సంతతి జడ్జి వీకే రజా (57) నియమితులయ్యారు. ఇప్పటివరకు అటార్నీ జనరల్ పదవిని అధిష్ఠించిన వారిలో ఈయన ఎనిమిదోవాడు. జస్టిస్ రజా నియామకం బుధవారం నుంచి అమల్లోకి వస్తుందని ప్రధాని టోనీ టాన్ కెంగ్ యామ్ కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది. రజా... స్టీవెన్ చాంగ్ నుంచి అటార్నీ జనరల్ బాధ్యతలు స్వీకరిస్తారు. రజాను ప్రధాని టోనీ ప్రెసిడెన్షియల్ కౌన్సిల్ ఫర్ మైనారిటీ రైట్స్ సభ్యుడిగానూ నియమించారు. ఈ సభ్యత్వం మూడేళ్ళ కాలపరిమితి కలిగి ఉంటుంది.

2004లో రజా సుప్రీం కోర్టు జ్యుడిషియల్ కమిషనర్ గానూ, జడ్జిగానూ నియమితులయ్యారు. 2010 నుంచి సింగపూర్ లీగల్ ఎడ్యుకేషన్ ఇన్ స్టిట్యూట్ చైర్మన్ గానూ, జ్యుడీషియల్ లెర్నింగ్ బోర్డ్ అధ్యక్షుడిగానూ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

  • Loading...

More Telugu News