: ప్రధాని చేతుల మీదుగా గోదావరి పుష్కరాలను ప్రారంభిస్తాం: మంత్రి మాణిక్యాలరావు


గోదావరి పుష్కరాలను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు రాష్ట్రప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుందని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు తెలిపారు. మంగళగిరిలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి హాజరైన ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోడీ గోదావరి పుష్కరాలను ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలో 25 వేల ఎకరాలకు పైగా దేవాదాయ భూములు ఆక్రమణలు, కోర్టు కేసుల్లో ఉన్నట్లు గుర్తించినట్లు ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News