: ఇదే సరైన సమయం... ఈ అవకాశం వదులుకోవద్దు: హరిబాబు


ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీకి ఇబ్బంది లేకుండా భారతీయ జనతా పార్టీని పటిష్ఠం చేస్తామని ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు హరిబాబు తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో పార్టీ నేతలు, పథాధికారుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, బీజేపీ చొరవతోనే పోలవరం ముంపు మండలాలు ఆంధ్రప్రదేశ్ లో కలిశాయని అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, ఆర్థిక సరళీకరణ, రాష్ట్రాభివృద్ధిలో బీజేపీ కీలక పాత్ర పోషించాల్సి ఉందని ఆయన తెలిపారు. ఈ క్రమంలో పార్టీని ఆంధ్రప్రదేశ్ లో బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. బీజేపీ రాష్ట్రంలో నిలదొక్కుకునేందుకు ఇదే సరైన సమయమని ఆయన అభిప్రాయపడ్డారు. దీనిని పార్టీ నేతలు వదులుకోకూడదని హరిబాబు పార్టీ నేతలకు సూచించారు.

  • Loading...

More Telugu News