: వారిని విడిచి పెడితే నా కన్యత్వాన్ని కానుకగా ఇస్తా: ఉగ్రవాదులకు పాప్ సింగర్ ఆఫర్
నైజీరియాకు చెందిన ప్రముఖ మహిళా పాప్ సింగర్ అడోకియా (23) ఓ సంచలన ప్రకటన చేసింది. బోకోహరామ్ అనే ఉగ్రవాద సంస్థ తమవద్ద బంధీలుగా ఉన్న స్కూల్ విద్యార్థినులను విడిచిపెట్టాలని ఆమె విజ్ఞప్తి చేసింది. అలా చేస్తే, మిలిటెంట్లకు తన కన్యత్వాన్ని సమర్పించుకుంటానని ప్రకటించింది. 200 మంది స్కూల్ విద్యార్థినులను ఉగ్రవాదులు అపహరించుకుపోయిన విషయం తెలిసిందే.
వారంతా వయసులో చిన్నవారని, వారిని ఎత్తుకెళ్లడం సరికాదంది. వారిని విడిచిపెడితే, బదులుగా తన కన్యత్వాన్ని ఇస్తానని ఆమె ఆఫర్ చేసింది. 'వారంతా 15 ఏళ్ల లోపు వారే. నేను పెద్దదాన్ని. ఓ రాత్రికి 10 నుంచి 12 మంది ఉగ్రవాదులు నన్ను తీసుకెళ్లినా పర్లేదు' అని ఆమె పేర్కొంది. ఇలాంటి ప్రకటనలకు అడోకియా పెట్టింది పేరు. తన తల్లికి ఓ విమానాన్ని బహుమతిగా ఇస్తే, వారికి తన కన్యత్వాన్ని ఇచ్చుకుంటానని లోగడ ఇలాగే ఓ సారి ప్రకటించి వార్తల్లో నిలిచింది.