: కేర్ ఆస్పత్రిలో ఇవాళ్టి నుంచి ఉచిత వైద్య శిబిరం


హైదరాబాదు బంజారాహిల్స్ లోని కేర్ ఔట్ పేషంట్ విభాగంలో ఇవాళ్టి నుంచి ఐదు రోజుల పాటు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు మీడియా మేనేజర్ శివశంకర్ తెలిపారు. రంజాన్ సందర్భంగా ఉపవాసం ఉండాలనుకునే ముస్లింల కోసం ప్రత్యేకంగా ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఉపవాస దీక్ష చేయాలనుకునే వారికి అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. ప్రతిరోజూ మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ శిబిరం కొనసాగుతుంది.

  • Loading...

More Telugu News