: బ్రెజిల్ సాకర్ ఫ్యాన్స్ విచిత్ర అభిమానం


ఫుట్ బాల్ కు ఆతిథ్యమిస్తున్న బ్రెజిల్ లో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. విఖ్యాత ఫార్వర్డ్ లియొనెల్ మెస్సీని అభిమానిస్తూనే, అతని జట్టు అర్జెంటీనాను మాత్రం ద్వేషిస్తున్నారు బ్రెజిలియన్లు. మెస్సీ మాయాజాలం ఆతిథ్య దేశస్తులను సమ్మోహితులను చేస్తోందట. అయితే, చిరకాల ప్రత్యర్థి అర్జెంటీనాకు మాత్రం మద్దతు పలికేదిలేదని బ్రెజిల్ వాసులు అంటున్నారు. ఈ విషయంలో బ్రెజిల్ మాజీ స్టార్ రొనాల్డో ఏమంటున్నాడో వినండి. బ్రెజిల్ జట్టులో ఓ విదేశీయుడికి చోటు కల్పించవచ్చంటే, నిస్సందేహంగా మెస్సీనే ఎంచుకుంటానని చెెప్పాడు.

తాజా వరల్డ్ కప్ లో మెస్సీ నాలుగు గోల్స్ తో బ్రెజిల్ సూపర్ స్ట్రయికర్ నేమార్ తో సంయుక్తంగా అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. నేమార్ అద్భుతంగా ఎదుగుతున్నాడు కానీ, ప్రస్తుత టాప్ ఫార్వర్డ్ మాత్రం మెస్సీనే అని బ్రెజిల్ దేశస్తుడొకరు చెప్పడం బ్రెజిల్ లో మెస్సీ మానియాను చాటుతోంది.

  • Loading...

More Telugu News