: తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం... టీటీడీ అధికారి మృతి


తిరుమల ఘాట్ రోడ్డులో జరిగిన ప్రమాదంలో ఒకరు మరణించారు. టీటీడీలో ఎండోమెంట్ సూపరింటెండెంట్ గా పనిచేస్తున్న ఏకాంబరం, అతని బంధువు గోవింద నాయుడుతో కలిసి బైక్ పై వెళ్తుండగా 15వ మలుపు వద్ద వీరిని ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో బైక్ పై వెళ్తున్న వారిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స నిమిత్తం తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఏకాంబరం మరణించగా, గోవింద నాయుడు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. ప్రమాదం విషయం తెలుసుకున్న టీటీడీ ఈవో గోపాల్ తో పాటు ఉద్యోగులు పెద్ద సంఖ్యలో రుయా ఆసుపత్రికి చేరుకున్నారు.

  • Loading...

More Telugu News