: ఆంధ్రప్రదేశ్ లో వర్షాలు... అరకలు పట్టి మెరకలు దున్నేందుకు సిద్ధమైన రైతన్న
రాయలసీమ మినహా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని, దాని కారణంగా రాయలసీమ మినహా కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని నిపుణులు వెల్లడించారు. చల్లబడిన వాతావరణంతో సాధారణ ప్రజలు కాస్త సేదదీరారు. కాగా, గత పది రోజులుగా కోస్తాంధ్రలో వడగాలులు విరుచుకుపడ్డాయి.
వర్షాభావానికి తోడు ఎండలు మండిపోవడంతో రైతులు, సామాన్యులు ఇబ్బందులు పడ్డారు. ఖరీఫ్ ప్రారంభమవుతున్నా వర్షాల జాడలేకపోవడంతో రైతన్న ఆవేదన చెందాడు. నిన్న సాయంత్రం ఆకాశం మబ్బులు పట్టి, రాత్రి చిరుజల్లు తడపడంతో రైతన్న పులకించిపోయాడు. అరకలు పట్టి మెరకలు దున్నేందుకు సిద్ధమయ్యాడు. ఆలస్యంగానైనా ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనందుకు ఆనందం వ్యక్తం చేస్తున్నాడు.