: క్రికెట్ పటిష్ఠతకు పనిచేస్తా: శ్రీనివాసన్
క్రికెట్ క్రీడ పటిష్ఠతకు పనిచేస్తానని ఐసీసీ నూతన చైర్మన్ గా బాధ్యతలు చేపట్టబోతున్న బీసీసీఐ మాజీ అధ్యక్షుడు ఎన్ శ్రీనివాసన్ తెలిపారు. ఐసీసీ గవర్నింగ్ బాడీ శ్రీనివాసన్ పేరును నూతన చైర్మన్ గా ఖరారు చేసింది. దీంతో ఆయన మాట్లాడుతూ... ఐసీసీ చైర్మన్ గా తనని ఎంపిక చేయడాన్ని గౌరవంగా భావిస్తానని చెప్పారు. అంతర్జాతీయ క్రికెట్ లో మరిన్ని బలమైన జట్లను చూడాలని తాను కోరుకుంటున్నానని తెలిపారు. స్థానికంగా క్రీడాకారులను అభివృద్ధి చేయడానికి కష్టించి పనిచేయాల్సి ఉందన్నారు.