: ఈ డాక్టర్ విస్కీతో చికిత్స చేస్తాడు!


వరంగల్ లో ఓ వైద్యుడు విస్కీతో చికిత్స చేసి వార్తల్లోకెక్కాడు. వివరాల్లోకెళితే... వర్ధన్నపేటకు చెందిన శ్రీపాల్ రెడ్డి అనే వ్యక్తి పురుగుల మందు కలిసిన నీటిని తాగడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే అతడిని వరంగల్ మమత నర్సింగ్ హోంకు తీసుకెళ్ళారు. అక్కడి డాక్టర్ రవీందర్ రెడ్డి విస్కీ ఉపయోగించి బాధితుడికి వైద్యం చేశాడు. కానీ, పరిస్థితి విషమించడంతో వేరే ఆసుపత్రికి తీసుకెళ్ళాలని చెప్పాడు. ఈ నేపథ్యంలో బాధితుడి తండ్రి సత్యనారాయణ రెడ్డి సదరు డాక్టర్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విస్కీతో చికిత్స చేసినందునే ఆరోగ్యం బాగా దెబ్బతిన్నదని అన్నారు. రూ.10 లక్షలు ధారపోసినా పరిస్థితి మెరుగవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

అయితే తన ట్రీట్ మెంట్ సరైనదేనని డాక్టర్ రవీందర్ రెడ్డి సమర్థించుకున్నారు. పురుగుల మందులో ఉండే విషపదార్థం ఇథనాల్ కు విస్కీయే సరైన విరుగుడు అని చెప్పారు. ఇది వైద్యశాస్త్రంలో ఉన్న విషయమేనని తెలిపారు.

  • Loading...

More Telugu News