: ధూమపానం మానేయాలనుకుంటున్నారా ... అయితే వ్యాయామం చేయండి!


సిగరెట్‌ వాసన కిట్టని భార్యలు, భర్తలతో వ్యాయామం చేయిద్దాం అనుకుంటున్నారా.. ఇది మీక్కాదు. యుక్తవయసు పిల్లల్లో ప్రతినిత్యం కనీసం అరగంటపాటు వ్యాయామం చేసే అలవాటు దీర్ఘకాలంగా ఉంటే.. ధూమపానం అలవాటు పట్ల ఆసక్తి తగ్గుతుందని ఓ రీసెర్చి తెలియజేస్తోంది. వ్యాయామం వల్ల కలిగే సరికొత్త ప్రయోజనంగా అమెరికా పరిశోధకులు దీన్ని గుర్తించారు. వాషింగ్టన్‌ యూనివర్సిటీకి చెందిన కింబెర్లే హార్న్‌ నేతృత్వంలో అనేక పరిశోధనలు జరిగాయి. పొగతాగే యుక్తవయసు పిల్లలను వారు పరిశీలించారు. వ్యాయామం మొదలెట్టిన వారు స్మోకింగ్‌ మానేయాలని అనుకుంటున్నట్లు గుర్తించారు. వ్యాయామం ప్రభావం ఎలా వస్తోందో అర్థం కాకపోయినా.. శారీరక శ్రమ వలన శరీరంలో ఎండార్ఫిన్లు అధికంగా విడుదల అవుతాయని, హాయింగా ఉన్నాం అనే భావన కలిగిస్తాయని వారు వివరించారు.

  • Loading...

More Telugu News