: హ్యాంగోవర్ ను 'బ్రేక్' చేయొచ్చు!


మందుబాబులను వేధించే అతి ప్రధానమైన సమస్య హ్యాంగోవర్. బాగా మందు బిగిస్తే ఎక్కే కిక్కు మనిషిని సుప్తావస్థలోకి నెడుతుంది. ఆ నిద్రలోంచి బయటికి వచ్చిన తర్వాత తలను సమ్మెటతో కొడుతున్నట్టు, తల బరువు ఓ వెయ్యిరెట్లు పెరిగినట్టు ఓ ఫీలింగ్. ఆల్కహాల్ పరిభాషలో దాన్ని హ్యాంగోవర్ అని పిలుచుకుంటాం. అయితే, దాన్నుంచి ఈజీగా బయటపడొచ్చంటున్నారు ఇంగ్లండ్ లోని కీల్ యూనివర్శిటీ పరిశోధకులు. అందుకే ఏం చేయాలో వారు చెబుతున్నారు.

ఉదయం బ్రేక్ ఫాస్ట్ రూపంలో బాగా వేయించిన ఆహారపదార్థాలను తీసుకుంటే హ్యాంగోవర్ కు చెక్ పెట్టొచ్చట. వేయించిన వంటకాల్లో అధికంగా కార్బోహైడ్రేట్స్ ఉంటాయని, ఆల్కహాల్ కారణంగా పడిపోయిన షుగర్, గ్లూకోజ్ లెవెల్స్ ను అవి భర్తీ చేస్తాయని పరిశోధకులు తెలిపారు. ఫలితంగా హ్యాంగోవర్ ఛాయలు దూరమవుతాయని వివరించారు.

  • Loading...

More Telugu News