: రూ.6 వేలకే గూగుల్ ఫోన్
ఆండ్రాయిడ్ వెర్షన్ తో తక్కువ ధరలో స్మార్ట్ ఫోన్ ను మార్కెట్లోకి తీసుకురావడానికి గూగుల్ రంగంలోకి దిగింది. ఆండ్రాయిడ్ వన్ శ్రేణిలో మొబైల్ ఫోన్లను తీసుకురావడానికి భారతీయ మొబైల్ తయారీ కంపెనీలు మైక్రోమ్యాక్స్, స్పైస్, కార్బన్ కంపెనీలతో జట్టు కట్టినట్లు గూగుల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సుందర్ పిచ్చాయ్ వెల్లడించారు. ఈ ఫోన్ ను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తామని, అయితే ముందుగా భారత్ లో ఈ ఏడాదిలోనే విడుదల చేస్తామని చెప్పారు. దీని ధర 100 డాలర్ల లోపు ఉండవచ్చని సమాచారం. అంటే ఆరు వేల రూపాయల్లోపు అన్నమాట.