: 'సత్యం' కేసులో తుది తీర్పు తేదీ వాయిదా


సత్యం కంప్యూటర్స్ కుంభకోణం కేసులో తుది తీర్పు తేదీని హైదరాబాదులోని ప్రత్యేక కోర్టు వాయిదా వేసింది. జులై 28న ఆ తేదీని వెల్లడించనుంది. వాస్తవానికి ఈ రోజే తీర్పు వెల్లడించాల్సి ఉన్న సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 2010 నవంబరు నుంచి రోజువారీ విచారణ చేపట్టిన ప్రత్యేక న్యాయస్థానం 211 మంది సాక్షులు, 15 మంది దర్యాప్తు అధికారులను విచారించింది. ఈ సమయంలో 3115 అనుబంధ దస్త్రాలను కూడా పరిశీలించింది.

  • Loading...

More Telugu News