: ఐసీసీ ఛైర్మన్ గా శ్రీనివాసన్ నియామకం


ఐసీసీ (ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్) కొత్త ఛైర్మన్ గా ఎన్.శ్రీనివాసన్ ఎన్నికయ్యారు. ఈ మేరకు మెల్బోర్న్ లో ఈ రోజు జరుగుతున్న ఐసీసీ వార్షిక సమావేశంలో... శ్రీని ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు 52 మంది సభ్యుల పూర్తి కౌన్సిల్ అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా స్పందించిన శ్రీనివాసన్, ఐసీసీ ఛైర్మన్ గా తన పేరును ధృవీకరించడం గౌరవంగా ఉందన్నారు. క్రికెట్ పునాదులను మరింత బలోపేతం చేసేందుకు తనవంతు కృషి చేస్తానని తెలిపారు. ఐపీఎల్ ఆరవ సీజన్ లో చోటు చేసుకున్న స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ స్కాం నేపథ్యంలో, బీసీసీఐ ఛైర్మన్ పదవి నుంచి కొన్ని నెలల కిందట శ్రీని వైదొలగారు. అటు శ్రీని ఎన్నికపై మాజీ క్రికెటర్ కీర్తీ ఆజాద్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన ఎన్నిక దురదృష్టకరమని ఆరోపించారు.

  • Loading...

More Telugu News