: నేడు 'అమ్మ ఫార్మసీ'లు ప్రారంభించనున్న 'అమ్మ'
తమిళనాట చవకగా ఔషధాలు అందించేందుకు ఉద్దేశించిన 'అమ్మ మరుంతంగం' ఫార్మసీలను సీఎం జయలలిత నేడు ప్రారంభించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 100 ఫార్మసీలు ఏర్పాటు చేయగా, వాటిలో పది చెన్నైలో నెలకొల్పారు. వీటిలో రాయితీ ధరలపై మందులు విక్రయిస్తారు. ఇప్పటికే తమిళనాడులో అమ్మ క్యాంటీన్లు, అమ్మ మినరల్ వాటర్, అమ్మ ఉప్పు... ఇలా ఎన్నో బడ్జెట్ పథకాలు ప్రజల ఆదరణ చూరగొన్నాయి. తాజాగా ఫార్మసీలు కూడా ఇదే రీతిలో ప్రజలను ఆకట్టుకుంటాయని అధికార వర్గాలు భావిస్తున్నాయి. ఈ ప్రాజెక్టు కోసం జయ సర్కారు రూ.20 కోట్లు కేటాయించింది.