: అక్తర్ ఎట్టకేలకు పెళ్లికొడుకయ్యాడు


స్టేడియంలో చిరుతపులిలా పరుగెత్తుతూ బౌలింగ్ చేసే రావల్పిండి ఎక్స్ ప్రెస్ షోయబ్ అక్తర్ గుర్తున్నాడా? పాక్ మాజీ బౌలర్ అయిన అక్తర్ 38 ఏళ్ల వయసులో మొత్తానికి ఓ ఇంటివాడయ్యాడు. 20 ఏళ్ల వయసున్న లేలేత వధువు రుబాబ్ ను బుధవారం షాదీ చేసుకున్నట్లు సమాచారం. వధువు ఖైబర్ ఫంక్తుంక్వా ప్రాంతంలోని హరిపూర్ జిల్లా వాసి. అక్తర్ తల్లిదండ్రులు, మరికొందరు మాత్రమే ఈ వివాహానికి హాజరయ్యారు. రుబాబ్ గత నెలలోనే అబ్బోటాబాద్ లో ఇంటర్ పరీక్షలు రాసిందని సమాచారం.

  • Loading...

More Telugu News