: ఎన్డీయే మంత్రులకు కొత్తకార్లు లేనట్టే!


ప్రధాని నరేంద్ర మోడీ పాలన పరంగా తనదైన ముద్రతో ముందుకువెళుతున్నారు. ఎన్డీయే మంత్రులు కొత్తకార్లు కొనరాదని సూచించారు. లక్ష పైబడి చేసే ఖర్చుకు పీఎంవో కార్యాలయం అనుమతి తప్పనిసరి అని స్పష్టం చేశారు. దేశ పురోగతి కోసం కొన్ని చేదుగుళికలు తప్పవన్న మోడీ సొంత క్యాబినెట్ కూ అదే చికిత్స అమలు చేస్తున్నట్టున్నారు. కాగా, ఇటీవలే రైల్వే ఛార్జీలు పెంచడంతో దేశవ్యాప్తంగా నిరసనలు చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ వ్యతిరేకత నుంచి ప్రజల దృష్టి మరల్చడంతోపాటు సానుభూతి పొందేందుకు మోడీ... క్యాబినెట్ పై ఆంక్షలు, కొత్తకార్లు కొనరాదన్న సూచనలు, చేస్తున్నారన్నది ఢిల్లీ టాక్! కాగా, అనవసర ఖర్చులు తగ్గించే క్రమంలో భాగంగానే మోడీ అతి చిన్న క్యాబినెట్ తో నెట్టుకొస్తున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News