: జమాత్ ఉద్ దవా (లష్కరేతోయిబా)పై అమెరికా నిషేధం
పాకిస్తాన్ లో వేళ్ళూనుకుపోయిన లష్కరే తోయిబా ఇటీవల జమాత్ ఉద్ దవాగా రూపాంతరం చెందిన విషయం తెలిసిందే. అమెరికా ఆంక్షల నేపథ్యంలో లష్కరే పేరు మారింది. అయితే, అగ్రరాజ్యం ఉగ్రవాదంపై తన పంథాకు కట్టుబడి ఉండడంతో లష్కరే పప్పులు ఉడికేట్టు కనిపించడంలేదు. తాజాగా జమాత్ ఉద్ దవాను కూడా నిషేధిత ఉగ్రవాద దేశాల జాబితాలో చేర్చుతున్నట్టు అమెరికా ప్రకటించింది. అంతేగాకుండా లష్కరేకు చెందిన ఇద్దరు నేతలపైనా ఆంక్షలు విధించింది. లష్కరే ఆర్థిక వ్యవహారాలు పర్యవేక్షించే నజీర్ అహ్మద్ చౌధరీ, మహ్మద్ హుస్సేన్ లపై గ్లోబల్ టెర్రరిస్టులుగా ముద్రవేసింది. తద్వారా, లష్కరే ఆర్థిక మూలాలను దెబ్బతీయొచ్చన్నది అమెరికా వ్యూహం.