: వైట్ హౌస్ ను వెనక్కి నెట్టిన మోడీ


భారత ప్రధాని నరేంద్ర మోడీ సోషల్ మీడియాను సవ్యరీతిలో వినియోగించుకోవడంలో దిట్ట. ఆ విషయం ఎన్నికల్లో స్పష్టమైంది. తాజాగా, ఆయన ట్విట్టర్ ఫాలోయింగ్ పరంగా ప్రపంచ నేతల్లో నాలుగోస్థానంలో నిలిచారు. ఈ విషయంలో ఆయన అమెరికా అధ్యక్ష కార్యాలయం వైట్ హౌస్ ను సైతం వెనక్కినెట్టి తన ఫాలోయింగ్ నిరూపించుకున్నారు. గ్లోబల్ పబ్లిక్ రిలేషన్స్, కమ్యూనికేషన్స్ సంస్థ 'బర్సన్-మార్స్ టెల్లర్' ఈ విషయమై ఓ జాబితా రూపొందించింది.

తాజాగా విడుదల చేసిన ఈ జాబితాలో అగ్రస్థానంలో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా (43 మిలియన్ల ఫాలోయర్లు) నిలిచారు. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా పోప్ ఫ్రాన్సిస్ (14 మిలియన్ల ఫాలోయర్లు), ఇండోనేసియా అధ్యక్షుడు సుసిలో బూంబాంగ్ యుధోయోనో (5 మిలియన్ల ఫాలోయర్లు), నరేంద్ర మోడీ (4,981,777 ఫాలోయర్లు) ఉన్నారు. వైట్ హౌస్ (4,980,207 ఫాలోయర్లు) కు ఐదోస్థానం దక్కింది. కాగా, సదరు సంస్థ ఈ ప్రపంచనేతల ట్విట్టర్ రాజకీయాలను 'ట్విప్లమసీ' గా అభివర్ణించింది.

  • Loading...

More Telugu News