: టీమిండియాకు ప్రాక్టీస్ దక్కేనా..?


సుదీర్ఘ పర్యటన కోసం ఇంగ్లండ్ వెళ్ళిన టీమిండియా నేడు ప్రాక్టీస్ మ్యాచ్ తో టూర్ కు శ్రీకారం చుట్టనుంది. ఈ మూడు రోజుల ప్రాక్టీసు మ్యాచ్ లో ధోనీ సేన లీసెస్టర్ షైర్ జట్టుతో తలపడుతుంది. ఇంగ్లండ్ టూర్ లో భారత్ ఐదు టెస్టులు, ఐదు వన్డేలు, ఓ టీ20 మ్యాచ్ ఆడనుంది. తొలి టెస్టు జులై 9న నాటింగ్ హామ్ లో ఆరంభమవుతుంది. కాగా, లీసెస్టర్ తో మ్యాచ్ లో భారత్ తన బ్యాటింగ్ వనరులను పరీక్షించుకోవాలని భావిస్తోంది. ప్రధానంగా ఇక్కడి వాతావరణ పరిస్థితులకు అలవాటుపడడంపైనా టీమిండియా శిబిరం దృష్టిపెడుతోంది.

  • Loading...

More Telugu News