: ఢిల్లీ చేరుకున్న చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ చేరుకున్నారు. ఆయన నేడు, రేపు హస్తినలో కేంద్ర ప్రభుత్వ ప్రముఖులతో భేటీ అవుతారు. రాష్ట్రానికి అవసరమైన నిధులు, పోలవరం ప్రాజెక్టు, రాజధాని, రుణమాఫీ తదితర అంశాలపై నేతలతో బాబు చర్చించనున్నారు. ఆయన తొలుత ప్రధాని నరేంద్ర మోడీని కలిసే అవకాశం ఉంది. అనంతరం పలువురు కేంద్ర మంత్రులతో రాష్ట్ర వ్యవహారాలపై సమావేశమవుతారు.