: అయిదువేల ఏళ్ల కిందే పంటిరోగాలు ఉన్నాయిట
దంతక్షయం, పిప్పిపళ్లు, పెరియోడాంటైటిన్ వంటి పంటిరోగాలకు పేర్లు ఇప్పుడు పెట్టిఉండొచ్చు గానీ.. ఇవి అయిదువేల ఏళ్ల కిందటినుంచి ఉన్నాయి. ఆ విషయాన్ని శాస్త్రవేత్తలు ఇప్పుడే కనుగొన్నారు. ఎలాగ? అని ఆశ్చర్యపోతున్నారా.. అయిదువేల ఏళ్ల కిందటి మమ్మీ ఒకదానిని పరిశోధించడం ద్వారా తెలుసుకున్నారు. ప్రపంచంలో అత్యంత ప్రాచీన ‘మమ్మీ’ల్లో నియోలిథిక్ ఓట్జి కూడా ఒకటి. ఇది క్రీస్తుపూర్వం 3300 నాటిది. అప్పట్లో ఈ 'మమ్మీ' దేహానికి పంటి రోగాలు ఉన్నాయని, అవి ఇప్పటికీ వేధిస్తున్నాయని జ్యూరిచ్ యూనివర్సిటీ పరిశోధకులు గుర్తించినట్లు ప్రొఫెసర్ ఫ్రాంక్ రూహ్లి చెప్పారు. అత్యాధునిక కంప్యూటర్ టోమోగ్రఫీ సమాచారం ఆధారంగా ఓట్జి దంతాల్ని పరిశీలించినట్లు పంటి డాక్టరు రోజెర్ సీలర్ చెప్పారు.