: వరి ధర పెరిగింది...క్వింటాల్ వరి 1360


వరి మద్దతు ధరను కేంద్ర ప్రభుత్వం పెంచింది. క్వింటాల్ వరికి 50 రూపాయలు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో క్వింటాల్ ధర 1360 రూపాయలకు చేరింది. కాగా, పెరిగిన సాగు వ్యయం కారణంగా వరి మద్దతు ధర కనీసం 100 రూపాయలైనా పెంచాలని రైతులు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. వ్యవసాయాన్ని లాభసాటిగా తీర్చిదిద్దుతామని కేంద్ర మంత్రి చెప్పిన మూడు రోజులకే 50 రూపాయల ధర పెంచడం విశేషం.

  • Loading...

More Telugu News