: ఈ నెల 29 నుంచి ఉజ్జయిని మహంకాళి ఉత్సవాలు
ప్రతి ఏటా హైదరాబాదులో నిర్వహించే ఉజ్జయని మహంకాళి ఉత్సవాలు ఈ నెల 29 నుంచి జులై 14 వరకు నిర్వహించనున్నారు. ముందుగా 29 నుంచి జులై 11వ తేదీ వరకు ఘటం ఊరేగింపు ఉంటుంది. 13న ఉదయం 4 గంటల నుంచి అమ్మవారి దర్శనం ఉంటుంది. అదే రోజు సాయంత్రం పోతురాజుల విన్యాసం జరుగుతుంది. చివరి రోజైన 14న ఉదయం 8.30 నుంచి జరిగే కార్యక్రమంతో ఉత్సవాలు ముగుస్తాయి.